కేన్సర్ ని అదుపు చేయండి.. కూరగాయలతో..!

కాలిఫ్లవర్, ఆలుదుంపలు, ఉల్లిపాయలను తీసుకుంటే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని తేలింది. ఈ విషయాన్నీ కనుగొన్నది జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన చైనా శాస్త్రవేత్త. ఉప్పు, నిల్వచేసిన ఆహార పదార్థాలు తిన్నట్లైతే, బీరు, మత్తుపానీయాలు, తగినట్లు అయితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.

బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది మృత్యు కౌగిలిలోకి వెళుతున్నారని కనుగొన్నారు. క్యాబేజీకి కూడా కేన్సర్‌ని అదుపు చేసే శక్తి ఉందని చెబుతున్నారు.

ప్రతి రోజూ వంద గ్రాముల పళ్లను ఆహారంగా తీసుకుంటే పొట్ట కేన్సర్‌ వచ్చే అవకాశాన్ని 5 శాతానికి తగ్గిస్తాయని వారు అంటున్నారు.. తెల్ల రంగులోని కూరగాయలన్నింటిలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టలో కణజాల ఒత్తిడికి వ్యతిరేకంగా యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతి రోజూ 45 గ్రాముల వరకు తీసుకున్నట్లయితే పొట్ట కేన్సర్ వచ్చే అవకాశాన్ని 9శాతానికి తగ్గిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *