ప్రభుత్వానికి సూచనలు చేయడంలో మీడియాది కీలక పాత్ర : మోడీ

ఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ స్వరోత్సవాలు విజ్ఞాన్ భవన్‌లో బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాపై అతినియంత్రణ సమాజానికి అనర్థం అని అన్నారు. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారని, తప్పుల ఆధారంగా మీడియాపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయడంలో మీడియాది కీలక పాత్ర అని, మీడియా పనితీరులో తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *