మొలకెత్తిన ధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు..

మొలకెత్తిన ధాన్యాలు ప్రాకృతికమైన ఆహార శక్తిని కలిగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించుటతో పాటు, వయసునూ పై బడనీయదు.. ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రొటిన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అసలు ఉండదు. శరీరంలోని మలినాలను బయటికి పంపుతాయి. ధాన్యాల్లో తగిన పోషకాలు ఉంటాయి. పచ్చిగా తినడం వల్ల సహజ పద్దతిలో పని చేస్తాయి. పచ్చి పదార్థాలు తీసుకోవటం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఉడికించటం వల్ల ఆహారంలోని పోషకాలు కొంతవరకు పోతాయి. వాటిని వేయించటం వల్ల అసలు పోషక విలువలుండవు. ఆరోగ్యానికి ఉత్తమ మార్గం పండ్లు తినాలి. మన ఋషులు, పూర్వీకులు కంద మూలాలు, పండ్లు తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉండగలిగారు.
శనగలు, పెసలు, బఠాణి మొదలగునవి ఎలా మొలకెత్తించాలో తెలుసుకుందామా..! ధాన్యాలు ఎక్కువ నీటిలో నానబెట్టడం మంచిది కాదు. అవి మునిగే వరకు నీరు పోస్తే చాలు. అవి నానాక తాజా నీటిలో కడిగి గుడ్డలో మూటకట్టి వేలాడదీస్తారు. ఆ మూటమీద అప్పుడప్పుడు నీటిని చల్లు తుంటారు నీటి తాకిడికి అవి రెండు నుంచి ఐదు రోజులలో మొలకలు వస్తాయి. వీటిని తీసుకోవటం వలన మన శరీరానికి కావలసిన పోషక విలువలు లభిస్తాయి. వీటిలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. శరీరం చురుగ్గా ఉంటుంది. స్థూలకాయం తగ్గేందుకు మొలకెత్తిన ధాన్యాలు ఉత్తమ సాధనమని నిపుణులు అంటున్నారు.
మొలకెత్తిన ధాన్యాలు తీసుకోవటం వలన ‘అసిడిటి’ ఉన్న యెడల తగ్గుతుంది. హృదయ సంబంధ వ్యాధులకు మూలకారణమైన కొలెస్టరాల్‌ తగ్గుతుంది. పచ్చికూరగాయాలు మొలకెత్తిన ధాన్యాలు, తేనె బెల్లం, నిమ్మరసం కలిపితే జ్వరం, కాన్సర్‌, మానసిక వ్యాధులు కూడా ఉండవని నిపుణులు అంటున్నారు. వీటిలో సోడియం, పొటాషియం అధికంగా ఉండటం వలన అధిక రక్తపోటుకు మంచి ఆహారం.
మొలకెత్తిన ధాన్యాల్లో విటమిన్‌ – సి, ఇ, ఏ ఉంటాయి. వీటిలో నీటి స్థాయి పెరుగుతుంది. రక్తవృద్ధికీ, కాలేయానికి, కావలసిన విటమిన్‌ – కె కూడా వీటిలో కొంతవరకు ఉంటుంది. పిల్లలు, వృద్దులూ తీసుకున్న యెడల వీటిని నమలటం వల్ల పళ్ళకు బలం, చిగుళ్ళకు వృద్ధి, గడ్డం కింద కండరాలు పెరగకుండా ఉంటాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *