ఆ హోటల్‌లో విందు చేయాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!

మీరు చదివింది నిజమే.. మహా అయితే ఎంత పెద్ద హోటల్‌ అయినా విందుకు లక్షలు దాటవు.. కోట్లు ఏమి అని అనుకుంటున్నారా..! మేం చెబుతుంది నిజమేనండి.. మీరు ఆ హోటల్‌లో విందు చేయాలంటే అక్షరాల 13 కోట్లు ఖర్చు పెట్టాలిసిందే.. ఏంటి విందుకు 13 కోట్లు ఖర్చు పెట్టాలా.. అంతలా ఆ హోటల్‌ లో స్పెషల్‌ ఏముంది.. ఇంతకి ఆ హోటల్‌ ఎక్కడుంది అంటారా.. అయితే చదవండి..

Singapoor Richest Hotel 1

సింగపూర్‌లోని మరీనా బే సాండ్స్‌ హోటల్‌లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల కోసం ‘సీ లా వా’ రెస్టారెంట్‌.. రష్యన్స్‌ వరల్డ్‌ ఆఫ్‌ డైమండ్స్‌ సంయుక్తంగా ఈ విందును ఏర్పాటు చేశాయి. ఇద్దరిని మాత్రమే అనుమితించే ఈ విందు ఖర్చు రూ. 13.4కోట్లు. కేవలం భోజనానికే అన్ని కోట్లు ఉండవు కదా! అందుకే రెస్టారెంట్‌లో విందుకు బుక్‌ చేసుకున్నవారికి మొదట 45 నిమిషాలు హెలికాఫ్టర్‌లో తిప్పుతారు. ఆ తర్వాత రోల్స్‌ రాయిస్‌ కారులో మరీనా బే హోటల్‌ వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి సింగపూర్‌ అందాల్ని విక్షేంచే విధంగా హోటల్‌ బాల్కానీలో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన.. సంపన్నులు మాత్రమే తినే పలు రకాల వంటకాలను వడ్డిస్తారు. అలాగే 40 సంవత్సరాల నాటి మద్యాన్ని కూడా అందిస్తారు. ఆ తర్వాత ఇద్దరికి కలిపి 2.08 క్యారట్‌ ఫ్యాన్సీ వివిద్‌ బ్లూ జానె సెమూర్‌ డైమండ్‌ ఉంగరాలను బహుమతిగా ఇస్తారు. ఈ ఉంగరాలు ప్రపంచంలోనే చాలా అరుదైన వజ్రాలతో చేశారట. వీటిని వేలం వేస్తే.. దాదాపు రూ. 13 కోట్లు వస్తాయమని అంచనా.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *