పేదలు నా వెనకే ఉన్నారు : ప్రధాని మోడీ

లక్నో: సోమవారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజీపూర్‌లో ప‌లు రైల్వే అభివృద్ధి ప‌నుల‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాప‌న చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 , 1000 నోట్లు రద్దు చేయడంతో నల్లకుబేరులు భయపడుతున్నారని, ఈ నిర్ణ‌యంతో సామాన్యుడికి కొన్ని క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, దీనికి తాను చింతిస్తున్నాన‌ని అన్నారు. పేదలకు మేలు చేయాలన్న తన నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపట్టడాన్ని ఆయన ఆగ్రహించారు.. నోట్ల రద్దు ప్రకటించిన రాత్రి నుంచి ప్రజలు హాయిగా నిద్రపోతున్నారని, నోట్ల రద్దుతో తనపై చాలామంది కోపంగా ఉన్నారన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా పేదల కోసమేనని వెల్లడించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా తన వెంట పేదలు ఉన్నారని మోడీ తెలిపారు. ఈ మహాయజ్ఞంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. త‌న చ‌ర్య‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌వారంతా చాలా బ‌లవంతుల‌ని, అయినా వారికి తాను భ‌య‌ప‌డ‌బోన‌ని మోదీ అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించేది లేదన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *