చంద్రబాబుకు తెలంగాణలో ఓటు హక్కు లేదు..

భద్రాద్రి కొత్తగూడెం : చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకుని విజయవాడకు వెళ్ళిపోయారని తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణలో బాబుకు ఓటేలేదు.. పార్టీ ఎక్కడిదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పెన్షన్లను ఐదు రెట్లుపెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 7 మండలాలను ఏపీలో కలిపడం వల్ల కొత్తగూడెం జిల్లా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *