అవినీతిపరుల ఆట కట్టిస్తాను : ప్రధాని మోదీ

నేను ప్రజలకు సేవకుడిని మాత్రమేనని, పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యంమని, నల్లధనంపై అలుపెరుగని పోరాటం చేస్తాను. అవినీతిపరుల ఆట కట్టిస్తాను అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ లో నిర్వహించిన పరివర్తన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. ‘దేశప్రజలకు ధన్యవాదాలు .. మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదని, మొబైల్ లావాదేవీలు జరపడం వచ్చేసింది కదా, ఎవరూ నేర్పకుండానే నేర్చుకోగలిగారు కదా. మొబైల్ ఉంటే పర్సుతో పనిలేదు.. నోట్లు లేకపోయినా డబ్బులు ఖర్చు చేయగలరు. నోట్లను నల్లకుబేరులు ఉపయోగిస్తున్నారు. నల్లధనం నిరోధానికి మీ సహకారం కావాలి. 2014 సార్వత్రిక ఎన్నికలలో వారణాసి నుంచి ప్రచారం ప్రారంభించా. కుశినగర్ లో వచ్చినంత జనాన్ని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. నేను చేస్తున్న పనులను ఆశీర్వదించడానికే ఇంతమంది ప్రజలు తరలివచ్చారు. మీ సహకారంతో అవినీతిపరుల ఆట కట్టిస్తాను’ అని మోదీ పేర్కొన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *