జొన్న రొట్టె – ఆరోగ్య రహస్యాలు

జొన్న గట్క, రాగి సంకటి… ఇవీ మన పూర్వికులు నిత్యం తీసుకొనే ఆహారాలు.. కానీ నేటి నాగరిక ప్రపంచంలో తినడానికి సమయం వెచ్చించలేకపోతున్న మనం ఫాస్ట్ ఫుడ్, రోడ్ సైడ్ టిఫిన్స్, ఇన్‌స్టంట్ ఆహారానికి అలవాటుపడిపోయి వ్యాధులను కొనితెచుకుంటున్నాము.. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్తులకి, ఊబ కాయులకి మంచి ఆహారం జొన్న రొట్టెలు..

జొన్నలతో చేసే రొట్టెలు ఎంతో రుచిగానే కాకుండా, బలవర్ధకమైన ఆహారం కూడా.. అందుకే జొన్న పిండి, రవ్వ, గటక, అటుకలు.. ఇలా జొన్నలతో చేసిన ఎటువంటి ఆహారం తిన్నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా బాడీ ఎంతో స్ట్రాంగ్ గా మారుతుంది. జొన్న రొట్టెలు చేసుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కింద తెలుసుకుందాం..

* నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు వున్నది..
* గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఎక్కువగా ఉంది.
* వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటిచూపు మందగించడం, మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి.
* జొన్న రొట్టెలు తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
* ఇందులో వుండే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి బాగా పెరడమే కాదు అందుకు అవసరమైన హార్మోన్లు వృద్ధి చెందుతాయి.
* బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది.
* శరీరంలో ఉండే చెడు కొవ్వుని తగ్గించే అరుదైన శక్తి జొన్న ఇందులో ఉంది.
* ఎముకలు పటిష్టంగా ఉంచేందుకు కావల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నలతో పుష్కలంగా దొరుకుతుంది.
* ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థం వంటి బియ్యం, గోధుమల్లో దొరకని ఎన్నో పోషకాలు కేవలం జొన్నల్లోనే లభిస్తాయి.
* జొన్నల్లో ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *