వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు.. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది

రక్షితమైనది, శక్తివంతమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వీలయినంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మంచిది. అంతే కాకుండా డయేరియా రాకుండా కాపాడుతుంది.

ఒత్తిడి వల్ల పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్‌ ను కంట్రోల్లో ఉంచుతుంది. రక్తంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. నరాల బలహీనత, క్షయ వంటి వాటిని దూరం చేస్తుంది.

మందువల్ల కలిగే రియాక్షన్లను నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లివర్‌ సమస్యలను దూరం చేస్తుంది.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *