పేదల ఆపిల్‌ జామకాయ..

జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. పచ్చిగా, దోరగా, పండుగా ఎలా ఉన్నా అమితయిష్టంగా తినగలిగే కాయ జమకాయ. ఇది ఉష్ణమండల ప్రాంతమైన ఆసియా దేశాలలో ఎక్కువగా పండుతుంది. ఆకుపచ్చ రంగు తోలు కలిగి ఉంటుంది. బాగా పండినప్పుడు పండు పసుపు వర్ణంలోకి మారుతుంది. తొక్క లోపల కండ గులాబీరంగులో కానీ, తెలుపురంగులో కానీ, ఎరుపులో కాని ఉంటుంది. జామకాయ లేదా పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

ప్రధానంగా జామకాయలో విటమిన్‌లు, పీచు, మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్‌, బిపి తగ్గుతాయి. బరువు తగ్గడానికి జామ దోహద పడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆకలి వేయడా నికి సమయం పడుతుంది. రోజు ఓ దోర జామపండు తింటే డయాబెటిస్‌, ప్రోస్టేట్ కేన్సర్‌ వంటి మరెన్నో వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.

పేగుల్లోని అధికంగా ఉన్న మ్యూకస్‌పొరను తొలగించి రక్తవిరేచనాలు తగ్గిస్తుంది. జీవక్రియలో జనించే స్వేచ్ఛా కణాలతో పోరాడి వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్‌ వ్యాధి, శుక్లాలు, కీళ్లవాపులు రాకుండా ఆపుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది .

మలబద్దకంతో బాధపడేవారికి, జామకాయలోని ఎక్కువగా ఉండే పీచుపదార్థాల వల్ల ఉప శమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది. అంతేకాక కడుపులోని మలినాలను, అంటు వ్యాధులను కలిగించే జీవులను తొలగిస్తుంది. ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి, పీచు, కొవ్వు లేకపోవటం, తక్కువ కార్బోహైడ్ర్‌ట్లు కలిగిన జామకాయ తినటం ఎంతో ఉపయోగకరం. జామ చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీనికోసం పచ్చి జామకాయలను తినాలి లేదా జామ పిందెలు, ఆకులు కలిపి తయారుచేసిన మిశ్రమంతో చర్మంపై రుద్దుకోవాలి.

పచ్చి పిందెలు, ఆకుల డికాషన్‌, పచ్చి కాయరసం, జలుబు నుండి దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. జామలోని విటమిన్‌ సి, కెరోటినా యిడ్స్‌, ఆఫ్‌ఎనోనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ మొదలైన ఫైటో న్యూట్రియంట్స్ దీనిని మంచి యాంటీ ఆక్సిడెంట్ గా చేశాయి. దానివల్ల పంటి నొప్పి, రక్తంలో ఆమ్లం ఎక్కువ అవటం, బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధులు, మ్యూకస్‌ పొర వాపు వల్ల వచ్చే రోగాలు, ఊపిరితిత్తుల్లో రక్తం అధికం కావటం, కండరాలు వంకరపోవటం, మూర్చ, అధిక రక్తపోటు, చిగుళ్లవాపు, ఊబకాయం, నోటిలో పుండ్లు, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వంటి వాటికీ చెక్‌ పెడుతుంది. అందుకే ఈ పండును పేదల ఆపిల్‌ పండుగా కూడా వైద్యులు పేర్కొంటారు..

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *