బెల్లంతో ఎన్ని ఉప‌యోగాలో మీకు తెలుసా..!

బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. అంతే కాకుండా బెల్లంతో మనం చాలా రోగాల నుంచి బయటపడవచ్చు. అవి ఏంటో తెలుసుకోండి..

బెల్లం తినడం వల్ల సాధారణ జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పి వంటి అనారోగ్యాలు దీంతో దూరమవుతాయి. శ్వాస నాళాలు శుద్ధి అవుతాయి. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బెల్లం కలిపి లేదా టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాల మంచిది.

వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.

మహిళలకు తలెత్తే రుతు సంబంధ సమస్యలకు బెల్లం ఔషధంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని కలిగించే గుణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి.

జీర్ణశక్తి మెరుగు పడాలంటే ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత కొంచెం బెల్లం తినండి..

రక్తహీనతను నివారించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు, యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో చాలా ఉన్నాయి. శరీరానికి కావల్సిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరకు బదులుగా చెరకుతో సహజ సిద్ధమైన పద్ధతిలో తయారు చేసిన ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచింది.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *