తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు తీపి కబురు అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీపి కబురు అందించింది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లల్లో ఖాళీగా ఉన్న స్వీపర్ కమ్ ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 190 పోస్టులను భర్తీ చేయనుంది..

స్వీపర్ కమ్ ప్యూన్: 190 (ఆంధ్రప్రదేశ్ 144, తెలంగాణ 46)

వ‌య‌సు : 2016 డిసెంబరు 16 వ తేదీ నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు కలిపించబడినది..

విద్యార్హత‌లు: ప‌దోత‌ర‌గ‌తి లేదా త‌త్సమాన అర్హత‌ ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో సరైన అవగాహన ఉండాలి. ఏ రాష్ట్రంలో పోస్టులకు ఆ రాష్ట్రాల వారే దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు : బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం: ఇందులో 5 విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. దీనిలో ప్రాంతీయ భాష (తెలుగు) 30 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 10 మార్కులు, జనరల్ ఆవేర్‌నెస్ 20 మార్కులు, అరిథిమెటిక్ 20 మార్కులు, సైకోమెట్రిక్ టెస్ట్ 20 మార్కులు. మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం : నవంబరు 26 నుండి ప్రారంభం అయినది..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: డిసెంబరు 16

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *