69 ఏళ్ల తరువాత తొలిసారి ఓటు వేస్తున్న..

కోల్‌కతా : ఇటీవలే భారత భూభాగంలో విలీనమైన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కూచ్‌బెహార్‌ జిల్లాలోని 51 సమూహాలకు చెందిన తొమ్మిదివేల మంది ఓటర్లు స్వాతంత్య్రం వచ్చిన 69 ఏళ్ల తరువాత తొలిసారిగా ఈ నెల 5న ఓటేయనున్నారు. ఏడాది క్రితం వరకు ఏ దేశానికి చెందకుండా ఒంటరిగా ఉండిపోయిన ఆ ప్రజలు తొలిసారిగా ఓటర్లుగా గుర్తింపు పొందారు.
భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు మధ్య 162 సమూహాల్లో ఉన్న ప్రజలకు థాబ్దాల కాలంగా దేశమంటూ లేదు. దీనిపై రెండు దేశాలు చర్చించుకున్నాయి. అనంతరం 2015 ఆగస్టు 1న ఈ ప్రాంతాలను భారత్‌, బంగ్లాదేశ్‌లు పంచుకున్నాయి. ఈ క్రమంలో 111 ప్రజా సమూహాలు బంగ్లాదేశ్‌లోకి, 51 సమూహాలు భారత్‌ కిందికి వచ్చాయి. ఇందులో 15వేల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 9,776 మంది ఓటర్లు ఉన్నారు. మే 5న పశ్చిబెంగాల్‌ అసెంబ్లీ చివరి విడత పోలింగ్‌లో వీరు ఓటేయనున్నారు. దినత, మెక్లిగంజ్‌, సితాయ్‌, సితాల్‌కుచి, తూఫాన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమూహాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతాల ప్రజలకు ప్రస్తుతం రెండు పెద్ద సమస్యలు ఉన్నాయని భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య పంపకాల కమిీ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ దీప్తిమాన్‌ సేన్‌ గుప్తా తెలిపారు. భారత పౌరసత్వం పొంది ఏడాది కావస్తున్నా, భూభాగాలపై తమకు ఇంకా హక్కులు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. అంతేకాక, ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీసం పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *